Naga Chaitanya | అందుకే వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘గత ఏడాదిన్నర నుంచి నా జీవితంలో నిజమైన తండేల్ అల్లు అరవింద్గారు. ఆయన లేకుండా మరో సినిమా చేయగలనా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా విషయంలో ఆయనో మార్గదర్శిలా నిలిచారు’ అన్నారు నాగచైతన్య.
Naga Chaitanya | ‘గత ఏడాదిన్నర నుంచి నా జీవితంలో నిజమైన తండేల్ అల్లు అరవింద్గారు. ఆయన లేకుండా మరో సినిమా చేయగలనా అనే ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా విషయంలో ఆయనో మార్గదర్శిలా నిలిచారు’ అన్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయిక.
అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న విడుదలకానుంది. మంగళవారం విశాఖపట్నంలో ట్రైలర్ను విడుదల చేశారు. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో ప్రేమ, దేశభక్తి ప్రధానంగా ట్రైలర్ ఆకట్టుకుంది. ‘మా యాసను ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే’ అంటూ నాగచైతన్య చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది.
నాగచైతన్య మాట్లాడుతూ ‘నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇక్కడ సినిమాకు కలెక్షన్స్ షేక్ అవ్వాలి. ఫిబ్రవరి 7న థియేటర్లో రాజులమ్మ జాతరే’ అన్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచారని, కొన్ని సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

