Naga Chaitanya | ‘తండేల్’గా కొత్త నాగచైతన్యను చూస్తారు
Naga Chaitanya | 14ఏండ్ల కెరీర్.. విభిన్నమైన పాత్రలు.. అద్భుత విజయాలు.. ఇదీ అక్కినేని నాగచైతన్య ట్రాక్ రికార్డ్. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ కొడుకుగా అప్రతిహతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు నాగచైతన్య.
Naga Chaitanya | 14ఏండ్ల కెరీర్.. విభిన్నమైన పాత్రలు.. అద్భుత విజయాలు.. ఇదీ అక్కినేని నాగచైతన్య ట్రాక్ రికార్డ్. తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ కొడుకుగా అప్రతిహతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు నాగచైతన్య. వెండితెరపై హీరోగా తనదైన ముద్ర వేసిన చైతూ, త్వరలో ‘దూత’ వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీలో కనిపించనున్నారు. అలాగే చందు మొండేటి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న ‘తండేల్’ చిత్రంలో కథానాయకుడిగా మెరవనున్నారు. నేడు నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకరులతో చైతూ చిట్‌చాట్..
అందుకే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు
‘దూత’ సూపర్నాచురల్ థ్రిల్లర్. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ కథ చెప్పగానే థ్రిల్ ఫీలయ్యాను. చాలా కొత్తగా అనిపించింది. ఈ వెబ్ రిసీస్లో కథానుగుణంగా బ్లడ్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేతప్ప ఇబ్బందిపడే సన్నివేశాలేం ఉండవు. ఇంటిల్లిపాదీ హాయిగా చూడొచ్చు. సూపర్నాచురల్ థ్రిల్లర్స్ తీయడంలో విక్రమ్ దిట్ట. ఆయన తీసిన ‘13ఏ’, మా సంస్థలో చేసిన ‘మనం’ రెండూసూపర్ నాచురల్ కథలే. వాటిని మించేలా ఈ సిరీస్ ఉంటుంది.
అరవింద్ ఈ కథను బాగా నమ్మారు
చందు మొండేటి దర్శకత్వంలో చేయనున్న ‘తండేల్’ చిత్రం పేరుకు తగ్గట్టే కొత్త కథ. బెస్తవాళ్లలో నాయకుడ్ని ‘తండేల్’ అంటారు. అందుకు తగ్గట్టుగానే నా కేరక్టరైజేషన్ ఉంటుంది. అందుకే ఆ పాత్ర కోసం జిమ్‌లో నెలలు తరబడి కష్టపడ్డాను. వాస్తవసంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ప్రేమకథ ఇది. కథ వినగానే గొప్ప సినిమా అవుతుంది అనిపించింది. అల్లు అరవింద్ కూడా ఈ కథను బాగా నమ్మారు. ఆయన జడ్జిమెంట్ తెలిసిందేగా. కథ సగం ఇండియాలో సగం పాకిస్తాన్లో జరుగుతుంది. ‘లవ్‌స్టోరీ’ తర్వాత సాయిపల్లవి నేనూ కలిసి నటిస్తున్నాం. ఇందులో తనది ఇంపార్టెంట్ కేరక్టర్. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడంతో ఈ కథకు మరింత బలం చేకూరినట్టయ్యింది.
అదే నా ఆశ.. ఆశయం
‘తండేల్’లో శ్రీకాకుళం యాస మాట్లాడతాను. ఇందులో నా బాడీ లాగ్వేంజ్నీ, డైలాగ్ డిక్షన్నీ కొత్తగా డిజైన్ చేశాడు దర్శకుడు చందు. తను అనుకున్నట్టు ఆవిష్కరించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. డిసెంబర్ నుంచి మూడు నెలలపాటు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ప్రేమకథలకు ఇన్నాళ్లూ దూరమ్యాను. ఆ లోటు ఈ సినిమా భర్తీ చేయనుంది. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. నటుడిగా ఇంకా గొప్ప పాత్రలు చేసి, ఇంటిపేరును నిలబెట్టాలనేది నా ఆశ.. ఆశయం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

