Naga Babu: మా సభ్యత్వానికి రాజీనామా ప్రకటించిన నాగబాబు

గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమలో ఎంత హడావిడి నెలకొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా ఎన్నికల పేరుతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడంతో నిత్యం వీరు చర్చనీయాంశంగా మారారు. ఎట్టకేలకు ఆదివారంతో మా ఎలక్షన్స్‌కి తెరపడింది. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ గెలుపొందారు.
ముందు నుండి ప్రకాశ్ రాజ్‌కి సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చిన ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడంతో మెగా బ్రదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తన రాజీనామా ను మా అసోసియేషన్ కి 48 గంటల్లో తన స్టాఫ్ ద్వారా పంపుతాను అని తెలిపారు. ఇది ఎంతో ఆలోచించి, ప్రలోభాలకు అతీతంగా పూర్తి చిత్తశుద్ది తో తీసుకున్న నిర్ణయం అని అన్నారు. నాగబాబు తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు, నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

