shanmukh: దీప్తి గుర్తొస్తే బయటకు వెళ్లిపో అంటూ షణ్ముఖ్‌కి వార్నింగ్ ఇచ్చిన నాగ్

హౌజ్‌లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు సిరితో క్లోజ్ గా ఉంటూనే మరోవైపు దీప్తి చాలా గుర్తొస్తుందని బాధపడుతున్నాడు షణ్ముఖ్. ఈ క్రమంలో నాగార్జున షణ్ముఖ్‌ని కన్ఫెషన్ రూంలోకి పిలిచి క్లాస్ పీకాడు. సిరి అలా చేసుకోవడంలో ఎవరిది తప్పు అని నాగార్జున అడిగాడు. అది నా తప్పే సర్.. నేను అంతలా రియాక్ట్ అవ్వకపోయి ఉంటే.. సిరి అలా చేసి ఉండేది కాదు. ఇకపై అలా జరగనివ్వను అని హామీ ఇచ్చాడు. దీప్తి అంత గుర్తుకు వస్తుంటే.. వెళ్లిపో అని నాగార్జున అన్నాడు.
అంతలా ట్రిప్ అవ్వకు, అయోమయంలో ఉండకు.. నీ ఆట నువ్ ఆడుకో అని షన్నుకి నాగార్జున సలహా ఇచ్చాడు. ఇకపై కొత్త షన్నుని చూస్తారు.. ఇది మళ్లీ రిపీట్ చేయను సర్ అని వెళ్లిపోయాడు. అంతలా దీప్తిని మిస్ అవుతుంటే, ఇక్కడ ఉండలేకపోతే ఈ క్షణమే వెళ్లిపోమని గేట్లు తెరిచాడు నాగ్. పదేపదే ఇలా ట్రిప్ అవ్వకూడదని సూచించాడు. ఆ తరుమాత మానస్ వచ్చాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. కానీ ప్రియాంక విషయంలో ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నావ్ అని నాగార్జున అన్నాడు.
ఆమెకు చెబితే ఏం చేసుకుంటుంది.. ఎలా అర్థం చేసుకుంటుందో తెలియడం లేదు సర్.. నేను ఆమెకు ప్రతీ సారి చెబుతాను. ఇక్కడకి వచ్చింది ఆడటం కోసం. మనకు ఆట ముఖ్యం. బిగ్ బాస్ కప్ ముఖ్యమని చెబుతాను సర్. కానీ ఆమె ఎక్కువగా నా మీద ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది సర్ అని మానస్ తన వర్షన్‌ను వివరించాడు. ప్రియాంక పరిస్థితిని నాగార్జునకు వివరించాడు మానస్.
అయితే మానస్ మీద ప్రియాంక ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకుందో ఓ వీడియోను చూపించాడు. ఏదైనా సరే నిర్మోహమాటంగా, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.. ఇప్పుడు చెబితే ఏమనుకుంటుందో అని అనుకుంటున్నావ్.. ఇంకా ఫీలింగ్స్ ఎక్కువయ్యాక చెబితే? ఎలా ఉంటుంది అని మానస్‌ను ప్రశ్నించాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. ఈ పరిస్థితిని కూడా హ్యాండిల్ చేసుకుంటావ్ అని అనుకుంటున్నానంటూ నాగార్జున సలహా ఇచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

