Nag Ashwin | మా బుజ్జిని నడపండి.. ఎలాన్ మస్క్‌కు నాగ్అశ్విన్ ఆహ్వానం!
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సైన్స్‌ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Nag Ashwin | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సైన్స్‌ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ వాడిన కారు ‘బుజ్జి’ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. కొద్ది రోజుల క్రితం జరిగిన భారీ ఈవెంట్లో ఈ కారును పరిచయం చేశారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ కారు వివిధ నగరాల్లో సందడి చేస్తున్నది. తాజాగా చెన్నై రోడ్లపై ఈ కారు విహరిస్తున్న ఫొటోలపై దర్శకుడు నాగ్అశ్విన్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోలను పోస్ట్ చేసిన ఆయన ‘బుజ్జి’ వాహనాన్ని నడపాలంటూ టెస్లా కంపెనీ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను కోరారు.
‘డియర్ ఎలాన్ మస్క్ సర్.. మీరు భారత్‌కు వచ్చి మా బుజ్జిని నడపాలని కోరుకుంటున్నాం. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం. పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇండియాలోనే తయారు చేశాం. దీని బరువు ఆరు టన్నులు. మీ కంపెనీ టెస్లా తయారు చేసిన సైబర్‌ట్రక్, బుజ్జి కలిసి ప్రయాణం చేస్తే చూడముచ్చటగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తే ‘కల్కి’ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో కావాల్సినంత ప్రచారం జరుగుతుందని అభిమానులు అనుకుంటున్నారు. ‘కల్కి 2898’ చిత్రంలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హసన్, దీపికా పడుకోన్, దిశాపటానీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

