పదేండ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా
ఎవడే సుబ్రమణ్యం, మహానటి, కల్కి 2898ఏడీ.. దర్శకుడిగా నాగ్అశ్విన్ ఏంటో చెప్పడానికి ఈ లైనప్ చాలు. వినోదం, సందేశం, సంభ్రమ, భావోద్వేగం.. ఇలా ఏ ఉద్వేగాన్నైనా అద్భుతంగా ఆవిష్కరించగల దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ఆయన నిర్మాతగా మారి, తన అభిమాన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ సినిమాను నిర్మించారు.
ఎవడే సుబ్రమణ్యం, మహానటి, కల్కి 2898ఏడీ.. దర్శకుడిగా నాగ్అశ్విన్ ఏంటో చెప్పడానికి ఈ లైనప్ చాలు. వినోదం, సందేశం, సంభ్రమ, భావోద్వేగం.. ఇలా ఏ ఉద్వేగాన్నైనా అద్భుతంగా ఆవిష్కరించగల దర్శకుడు నాగ్ అశ్విన్. తాజాగా ఆయన నిర్మాతగా మారి, తన అభిమాన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘సింగ్ గీతం’ సినిమాను నిర్మించారు. ఈ విభిన్న కథాచిత్రం ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం నాగ్అశ్విన్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.
- ఈ కథ ఇప్పటిది కాదు. ‘పుష్పక విమానం’ చిత్రానికి ముందే సింగీతం ఈ కథను కమల్‌హాసన్‌కి వినిపించారట. కమల్, సింగీతం ఇద్దరూ తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న రోజులవి. ఈ కారణంగా ఈ కథ పట్టాలెక్కలేదు. చివరికి ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చి, విడుదలకు సిద్ధమైంది. సింగీతంగారి కథలకు కాలంతో పనుండదు. పుష్పకవిమానం, ఆదిత్య 369, భైరవద్వీపం.. ఇవన్నీ ఏ కాలంలో వచ్చినా చూసే సినిమాలే.
- ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. కుబేరపురంలో గోల్డ్ మైన్స్ ఉంటాయి. ఆ ఊరికి, ఆ గోల్డ్ మైన్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది సింగీతంగారి సిగ్నేచర్ స్టైల్లో, ఆయన ట్రేడ్ మార్క్ హ్యూమర్‌తో చెప్పడం జరిగింది. సింగీతం ఏ కథను ఆలోచించినా, అందులో మానవత్వం, వినోదం రెండూ ఉంటాయి. ఈ సినిమలో అదే టోన్ కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో సింగీతంగారి దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నాను. నిజానికి ఆయన్ను కలవడమే గొప్ప విషయం. అలాంటిది రెండేళ్లుగా ఆయనతో కలిసి ప్రయాణించడం, రోజూ మాట్లాడటం, ఆయనతో సినిమా తీయడం ఇదంతా మాట్లలో చెప్పలేని ఆనందం. దీన్ని ఒక గౌరవంగా భావిస్తున్నా.
- ఇది ప్రత్యేకమైన సబ్జెక్ట్. ఇలాంటి సినిమా ఇప్పటివరకూ రాలేదు. భవిష్యత్‌లోనూ రావడం కష్టం. సింగీతంగారిపై ఉన్న ప్రేమ, ఆయన విజన్‌పై ఉన్న ఇష్టంతో ఈ సినిమా చేశాను. ఈ కథను కొత్తవాళ్లతోనే చేయాలనేది సింగీతం అభిమతం. కొత్తవారితో పనిచేయడం ఆయనకిష్టం. ఈ కథకు కూడా అది అవసరం. ఇందులో మాటలన్నీ పాటల్లా ఉంటాయి. కానీ ప్రేక్షకులు కొద్ది సేపటికే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. పోస్ట్ ప్రొడక్షన్లో సినిమా చూశాను. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగింది. 94ఏండ్ల వయసులో మాలాంటి దర్శకులకు ధీటుగా, ఒక టీనేజర్ తీసినట్టు సింగీతం ఈ సినిమా తీశారు. నేను కేవలం నిర్మాతగా మాత్రమే కాకుండా, సింగీతంగారి విజన్‌ని తెచ్చేందుకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఈ సినిమాకు పనిచేశా.
- ఈ సినిమాలో నాన్‌స్టాప్ మ్యూజిక్ ఉంటుంది. కానీ ఎక్కడా మ్యూజిక్ వింటున్నాం అనే ఫీలింగ్ రాదు. దేవిశ్రీప్రసాద్ ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. తన సంగీతంతో సహజంగా ఎంటర్టైన్ చేశారు. ఇది వారం రోజులు చూసి మర్చిపోయే సినిమా కాదు. పదేళ్ల తర్వాత కూడా గుర్తుండే సినిమా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

