ఎన్టీఆర్, రామ్చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతున్నది. సినిమా విడుదలకు ముందే పాటలు యూట్యూబ్ వ్యూస్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ‘నాటు నాటు..’ లిరికల్ పాటను గతేడాది నవంబర్ 10న విడుదల చేశారు. గీత రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. సినిమాలో హుషారెత్తించే గీతంగా ‘నాటు నాటు’ ఉండనుంది.