Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
Mythri Movie Makers | తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. పంపిణీ రంగంలోనూ తన పట్టును మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా నైజాం మార్కెట్లో సంస్థకు చెందిన ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ దూకుడు ప్రదర్శిస్తోంది.
Mythri Movie Makers | తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. పంపిణీ రంగంలోనూ తన పట్టును మరింత పెంచుకుంటోంది. ముఖ్యంగా నైజాం మార్కెట్లో సంస్థకు చెందిన ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న పలు కీలక చిత్రాల నైజాం పంపిణీ బాధ్యతలను ఈ సంస్థ చేపట్టడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న పలు క్రేజీ సినిమాల నైజాం పంపిణీని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పర్యవేక్షిస్తోంది. సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న విడుదల కానుండగా, ఈ సినిమా నైజాం హక్కులు మైత్రీ సంస్థ వద్ద ఉన్నాయి.
ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘గరివిడి లక్ష్మి’ అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ రెండు సినిమాల నైజాం పంపిణీ బాధ్యతలను కూడా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నిర్వహిస్తుంది. ఒకే సమయంలో పలు సినిమాలు విడుదలవుతున్న తరుణంలో వాటి పంపిణీ బాధ్యతలు ఒకే సంస్థ చేతిలో ఉండటం సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రాలకు నైజాంలో ఎలాంటి థియేటర్ల కేటాయింపులు జరుగుతాయి? ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
కొత్త సినిమాల విడుదలతో పాటు ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శితమవుతున్న చిత్రాల పంపిణీలోనూ మైత్రీ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ‘హనుమాన్ అన్షు’తో పాటు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన ‘ది ప్యారడైజ్’ కూడా సంస్థ పంపిణీ పరిధిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో ఉన్న సంధ్య 70 ఎంఎం, సంధ్య 35 ఎంఎం, సుదర్శన్ 35 ఎంఎం వంటి ప్రముఖ థియేటర్లతో పాటు దిల్సుఖ్నగర్ మెగా, ఉప్పల్ రాజలక్ష్మి, బాలానగర్ విమల్ వంటి సింగిల్ స్క్రీన్లలోనూ మైత్రీ పంపిణీ చేస్తున్న సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యం లభిస్తోంది. నిర్మాణ రంగంలో ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు పంపిణీ వ్యాపారంలోనూ తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వరుసగా కీలక చిత్రాల పంపిణీ బాధ్యతలు చేపట్టడం సంస్థ వ్యూహానికి అద్దం పడుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

