My Name is Shruthi | టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా వచ్చిన ఛాన్స్‌లను వాడుకోవడంలో మొదట ఉంటుంది హన్సిక మోత్వానీ (Hansika Motwani ). చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ భామ, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన అగ్ర కథానాయికగా వెలుగొందింది. ఇదిలా ఉంటే హన్సిక తాజాగా నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి'(My Name is Shruthi). ‘ది హిడెన్ ట్రూత్’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నవంబర్ 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా డిసెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వవలసి ఉంది. క్రైమ్ థ్రిలర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీలో మురళీశర్మ, జయప్రకాష్, సాయితేజ, పూజారామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ ఈ సినిమాను నిర్మించింది. సంగీతం: మార్క్ కె రాబిన్, సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు.