Uorfi Javed | మా నాన్న ఎప్పుడూ హింసించేవాడు.. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశా: నటి ఉర్ఫీ జావేద్
Uorfi Javed | బాలీవుడ్ నటి, మోడల్, ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావేద్ చిన్న తనంలో తన తండ్రితో తనకున్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు తమను తమ తండ్రి నిత్యం హింసించేవాడని చెప్పింది.
Uorfi Javed | బాలీవుడ్ నటి, మోడల్, ఫ్యాషన్ ఇన్ఫ్లూయెన్సర్ ఉర్ఫీ జావేద్ చిన్న తనంలో తన తండ్రితో తనకున్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. చిన్నప్పుడు తమను తమ తండ్రి నిత్యం హింసించేవాడని చెప్పింది. ఐదుగురు తోబుట్టువుల్లో తాను రెండో దాన్నని, మా అందరినీ మా నాన్న ఎప్పుడూ తిడుతూ, కొడుతూ హింసపెట్టేవాడని వెల్లడించింది. మా అమ్మను కూడా నాన్న నోటికి వచ్చినట్టుగా తిట్టి, కొట్టేవాడని తెలిపింది. అమ్మతో సహా తామంతా నరకం అనుభవించామని చెప్పింది.
ఏదైనా పార్టీకి వెళ్తే అందరి కళ్లూ నాపైనే ఉండాలి..
ప్రస్తుతం డర్టీ మ్యాగజీన్ కవర్ ఫొటో షూట్లో ఉన్న ఉర్ఫీ జావేద్.. కొత్తగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పింది. తన తండ్రి హింస భరించలేక తాను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని తెలిపింది. తనకు మోడ్రన్‌గా బయటికి వెళ్లాలని ఉండేదని, కానీ మా నాన్న అందుకు అంగీకరించేవారు కాదని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. టీవీలో ఎప్పుడూ ఫ్యాషన్ షోలు చూడటం వల్ల తనకు ఫ్యాషన్ దుస్తులపై మక్కువ ఏర్పడిందని, నాకు పెద్దగా ఫ్యాషన్ పరిజ్ఞానం లేకపోయినా ఎలాంటి ఫ్యాషన్ వస్త్రాలు ధరించాలో తెలుసని పేర్కొంది. తాను నలుగురిలో అందంగా, భిన్నంగా కనిపించాలని కోరుకుంటానని, ఏదైనా పార్టీకి వెళ్తే అందరి కళ్లూ తనపైనే ఉండాలన్నది తన కోరికని ఆమె చెప్పింది.
మహిళలు మగాడి వెంట కాదు, మనీ వెంట పడాలి..
డబ్బు కోసం తాను ఎన్నో బాధలు పడ్డానని ఇదే ఇంటర్వ్యూలో ఉర్ఫీ జావేద్ తెలిపింది. ఒకప్పుడు తనకు బతకడానికే సరిపడా డబ్బు ఉండేది కాదని, కానీ తనకు తానుగా మాత్రం ధనవంతురాలిని అనే భావనలో ఉండేదాన్నని ఆమె చెప్పింది. అదేవిధంగా మహిళలు ఎదగడానికి మగాడి వెంట పడితే లాభం లేదని, మనీ వెంట పడాలని సూచించింది. అదేవిధంగా తన ఫ్యాషన్ వస్త్రధారణ తరచూ వివాదాస్పద వార్తలుగా మారడంపై కూడా ఉర్ఫీ స్పందించింది. తనకు శరీరాన్ని బెడ్ షీట్లలో దాచుకోవాలని ఉండదని, బయటికి చూపించడమే ఇష్టమని, అది తనకున్న అవకాశమని చెప్పింది.
చూపించడానికి ఏమీ లేకున్నా వివాదాస్పదమవుతున్నా..
చూపించడానికి తన దగ్గర పెద్దగా ఏమీ లేవని (తన ఛాతీని చూసుకుంటూ), అయినా తరచూ వివాదాస్పదమవుతున్నానని ఉర్ఫీ జావేద్ ఆవేదన వ్యక్తం చేసింది. అన్నీ పెద్దగా ఉంటే తాను ఎక్కడో ఉండేదాన్నో ఒక్కసారి ఊహించుకోండి అని వ్యాఖ్యానించింది. తాను తన శరీరంలో చూపించగూడనివి ఏమీ చూపించడంలేదని, అయినా కొందరికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందని ఆమె ప్రశ్నించింది. మిగతావారిలా తనది రెచ్చగొట్టే వస్త్రధారణ కూడా కాదని ఉర్ఫీ జావేద్ చెప్పింది.
ఇవి కూడా చదవండి..
RRR | ‘నాటు నాటు’ పాటకు పాక్ నటి డ్యాన్స్.. వీడియో వైరల్..!
Janhvi Kapoor | టాలీవుడ్ ఎంట్రీ కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు అడుగుతుందా?
Rubal Shekhawat | అవసరానికో అబద్దం మూవీ ఓపెనింగ్‌లో రుబాల్ షెకావత్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

