Ramana Gogula | ఇన్నేండ్లు సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉన్నాడో బయటపెట్టిన రమణ గోగుల
Ramana Gogula | స్వరకర్తగా, గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు రమణ గోగుల. కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ అందించిన ఆయన గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
Ramana Gogula | స్వరకర్తగా, గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు రమణ గోగుల. కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ అందించిన ఆయన గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో ‘గోదారి గట్టు..’ అనే గీతాన్ని ఆలపించారు. ఈ పాట మ్యూజిక్ చార్ట్స్‌లో అగ్రభాగాన కొనసాగుతున్నది. ఇప్పటికే 27 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా రమణ గోగుల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘నేను యూఎస్‌లో ఉంటున్నా. వ్యక్తిగత జీవితంలో బిజీ కావడం వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. నేను యూఎస్‌లో ఉన్నప్పుడు చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ కాల్ చేసి తప్పకుండా పాట పాడాలని కోరాడు. సాంగ్ పంపిస్తే రెండుసార్లు విన్నా. చాలా బాగా నచ్చింది. అందులో కొత్తదనంతో పాటు మంచి ఫీల్ ఉందనిపించింది. దాంతో తప్పకుండా పాడాలని నిర్ణయించుకున్నా’ అన్నారు. చాలా మంది ఫోన్ చేసి పాట బాగుందని, వాయిస్‌లో అదే మ్యాజిక్ ఉందని పొగడటం ఆనందంగా ఉందని, వెంకటేష్ కూడా ఫోన్ చేసి పాట గురించి మెచ్చుకున్నారని రమణ గోగుల తెలిపారు.
మళ్లీ మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తన వద్ద వినూత్నమైన ఐడియాస్ ఉన్నాయని, మంచి కథ, దర్శకుడు కాంబినేషన్ సెట్ అయితే తప్పకుండా కంపోజింగ్‌కు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల మ్యూజిక్ కంపోజింగ్‌లో మార్పులొచ్చాయని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సింగర్ అవసరం లేకుండా పాటను తయారుచేయొచ్చని, అయితే పాట తాలూకు ఆత్మ ఆవిష్కృతం కావాలంటే మావన గాత్రంతోనే సాధ్యమని రమణ గోగుల అభిప్రాయపడ్డారు. విదేశాల్లో మల్టీనేషనల్ కంపెనీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా ఎనలిటిక్స్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు గ్యాప్ వచ్చిందని ఆయన వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

