ఆర్యన్‌కు కనీసం అవకాశం ఉంది.. వాళ్ల నాన్న షారుఖ్ కదా: అస్లామ్ మర్చంట్
Mumbai Drugs Case | ‘క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కనీసం బయటపడే అవకాశం ఉంది. ఎంతైనా వాళ్ల నాన్న షారుఖ్ ఖాన్ కదా.

Mumbai Drugs Case | ‘క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కనీసం బయటపడే అవకాశం ఉంది. ఎంతైనా వాళ్ల నాన్న షారుఖ్ ఖాన్ కదా. ఆయన అత్యంత ప్రముఖ, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సెలెబ్రిటీ’.. ఈ మాటలు అన్నది ఏ ఎన్సీబీ అధికారో కాదు. ఆర్యన్‌తో పాటు అరెస్టయి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న అర్బాజ్ మర్చంట్ తండ్రి అస్లామ్.
అర్బాజ్ కానీ, అతని తండ్రి కానీ ప్రముఖులు కాదని, తాము చాలా సామాన్యులమని ఆయన అన్నారు. తనకు తెలిసి ఇదంతా అర్బాజ్ దురదృష్టమని అభిప్రాయ పడిన ఆయన.. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్‌లో అర్బాజ్ ఉన్నాడని, ఇది అతని తలరాతేమో అని బాధపడ్డారు. అయితే తన ప్రాణమిత్రుడు ఆర్యన్‌తో కలిసి అతను ఉండటం గొప్ప విషయమని, స్నేహితుల్లోనే స్నేహితుడిగా తన కుమారుడిని చెప్తానని అస్లామ్ అన్నారు.
కొన్ని రోజుల క్రితం ముంబై సముద్ర తీరంలో ఒక క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం అందుకున్న నార్కొటిక్స్ బ్యూరో అధికారులు దానిపై రెయిడ్ చేశారు. ఈ సమయంలోనే ఆర్యన్, అర్బాజ్ సహా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆర్యన్ వేసిన పిటిషన్‌ను నార్కొటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) కోర్టు కొట్టేసింది. దీంతో అతని తరఫు లాయర్లు ముంబై హైకోర్టు తలుపు తట్టారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

