అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా, సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘ముఖ్య గమనిక’. లావణ్య హీరోయిన్గా నటిస్తోంది. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆ కళ్ల చూపుల్లోనా’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా శనివారం మూవీ టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ కథ ఆసక్తికరంగా ఉంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్టర్ ఉత్కంఠను పంచింది’ అన్నారు. సరికొత్త థ్రిల్లర్ కథ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్ వెన్న, నిర్మాతలు: రాజశేఖర్, సాయికృష్ణ, దర్శకత్వం: వేణు మురళీధర్.వి.