సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తూ రజనీకాంత్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘ 7 డేస్ 6 నైట్స్’. ప్రముఖ దర్శక, నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. తన చిత్రాల ద్వారా నూతన నటీనటులను, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఎమ్మెస్ రాజు ఈ చిత్రం ద్వారా సమర్థ్ గొల్లపూడిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ విశేషాలను ఎమ్మెస్ రాజు తెలియజేస్తూ ‘మా చిత్రానికి సమర్థ్ వైవిధ్యమైన ట్రెండీ సంగీతాన్ని అందిస్తున్నాడు. 16 ఏళ్ల ఈ యువకుడు అందిస్తున్న సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది’ అన్నారు. మెహెర్ చాహల్, రోహన్, కృతికశెట్టి నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి.