‘ఒక వ్యక్తి రకరకాల వ్యక్తులుగా బతకడం అనేది నటులకు మాత్రమే దక్కే అదృష్టం. పాత్రలోకి వెళ్లాక మనం ఏంటో, ఎవరిమో మర్చిపోయి, కేరక్టర్‌గా మారిపోయి నటించడమే ఉత్తమ నటన. అయితే అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తాయి. నాకు మాత్రం వెంటవెంటనే వచ్చాయి. అవే సీతారామం, హాయ్ నాన్న’ అని చెప్పుకొచ్చింది మృణాళ్ఠాకూర్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత్రల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది మృణాళ్.
‘కొన్ని కేరక్టర్లు సెట్నుంచి బయటికి రాగానే మనసులోనుంచి వెళ్లిపోతాయి. కొన్ని మాత్రం వెంటాడతాయి. ‘హాయ్ నాన్న’లో చేసిన యష్ణ పాత్ర ఇప్పటికీ వెంటాడుతూనేవుంది. ఆ కథలోనే ఉంది ఆ మ్యాజిక్. అదో అందమైన కలలాంటి కథ. కూతురిగా, ప్రియురాలిగా, భార్యగా, అమ్మగా.. రకరకాల షేడ్స్‌లో కనిపించాను ఈ సినిమాలో. పైగా అంతులేని భావోద్వేగమంతా ఆ పాత్రలోనే ఉంది. అమ్మని కాకపోయినా ఆడదాన్ని కదా.. అందుకే యష్ణ వెంటాడుతూనేవుంది. థాంక్యూ డైరెక్టర్ శౌర్యువ్..’ అంటూ భావోద్వేగానికి లోనైంది మృణాళ్.