Mrunal Takhur | ఆయనే నన్ను వదిలేసి వెళ్లాడు.. బ్రేకప్ వెనుక కారణాలు వెల్లడించిన మృణాల్ ఠాకూర్
Mrunal Takhur | స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దో దీవానే శహర్ మే’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తన మాజీ ప్రేమ వ్యవహారం గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Mrunal Takhur | స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘దో దీవానే శహర్ మే’ మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా తన మాజీ ప్రేమ వ్యవహారం గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్ తన గత రిలేషన్షిప్ గురించి ఓపెన్‌గా స్పందించారు. “నేను సినిమాల్లోకి రావడం అతనికి అస్సలు నచ్చలేదు. నేను చాలా దూకుడుగా ఉంటానని, నాతో లైఫ్ కొనసాగించలేనని చెప్పి బ్రేకప్ చెప్పాడు. అయితే అతను బ్రేకప్ చెప్పినందుకు నేను బాధపడలేదు. కానీ అతని ఆలోచనా విధానంపై మాత్రం జాలి వేసింది. అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తితో బంధం కొనసాగించడం కష్టమే” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇలాంటి మైండ్‌సెట్ ఉన్న వాళ్లతో ఉంటే భవిష్యత్తులో పిల్లలు కూడా అదే విధమైన ఆలోచనలతో పెరుగుతారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే విడిపోవడం మంచిదని భావించాను అంటూ తన నిర్ణయానికి కారణాలు వివరించారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చకు దారి తీశాయి. ఇక గత కొద్ది నెలలుగా మృణాల్ ప్రేమ, పెళ్లి వార్తలతో తరచూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తమిళ్ స్టార్ హీరో ధనుష్‌తో డేటింగ్లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ ఇద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది. అయితే ఈ వార్తలను మృణాల్ టీమ్ స్పష్టంగా ఖండించింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడే గానీ, అంతకంటే ఏమీ లేదని మృణాల్ తేల్చి చెప్పారు.
ఇదే విధంగా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తోనూ డేటింగ్ రూమర్స్ వినిపించాయి. ఈ ప్రచారాన్ని కూడా ఆమె సరదాగా తీసుకున్నారు. “ఇలాంటి రూమర్స్ వినడానికి ఫన్నీగా ఉంటాయి. కొంతమంది వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి నవ్వుకుంటాను. ఇవన్నీ నాకు ఫ్రీ పీఆర్లాంటివే” అని చమత్కరించారు.ఇదిలా ఉండగా, మృణాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘దో దీవానే శహర్ మే’ చిత్రం ఈ నెల 20న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు రవి ఉద్యవర్ దర్శకత్వం వహించగా, సిద్ధాంత్ చతుర్వేది కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. రొమాంటిక్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

