M.R.P Teaser | నీకెంత.. నాకెంత?.. ఆకట్టుకుంటున్న ‘ఎంఆర్పీ’ టీజర్!
MRP | టాలీవుడ్ నటులు నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో శ్రవణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంఆర్పీ’ (MRP).
M.R.P Teaser | టాలీవుడ్ నటులు నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో శ్రవణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంఆర్పీ’ (MRP). ‘నీకెంత, నాకెంత’ అనే ఆసక్తికరమైన ఉపశీర్షికతో ఈ సినిమా రాబోతుండగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘మన కల కోసం మనం పనిచేయకపోతే.. వేరే వాళ్ల కలల కోసం మనం పనిచేయాల్సి ఉంటుంది’ అనే డైలాగుతో ప్రారంభమైన ఈ టీజర్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ డోనాల్ బిష్ట్ టాలీవుడ్లోకి కథానాయికగా అడుగుపెడుతున్నారు.
ఈ టీజర్‌ను గమనిస్తే, మధ్యతరగతి యువత కలలు, నేటి సమాజంలో ఆర్థిక సంబంధాల చుట్టూ సాగే ఒక విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు తెలుస్తుంది. గతంలో ‘మత్తు వదలరాస గుర్రం పాపి రెడ్డి వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య మరో ఆసక్తికర పాత్రలో కనిపిస్తుండగా, వెన్నెల కిశోర్ తనదైన శైలిలో వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు. ఎం.ఎస్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం కామెడీ మరియు యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా ఉండబోతోందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

