టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు వేడుకలను అభిమానులు, ఫాలోవర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇవాళ బర్త్ డే (Mahesh Birthday) సందర్భంగా మూవీ లవర్స్, ఫాలోవర్లతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు మహేశ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (Santosh Kumar J) స్టార్ హీరో మహేశ్ బాబుకు బర్త్ డే విషెస్ అందించారు.
మా విలువైన హరిత రక్షకులలో ఒకరైన మహేశ్ బాబుకు హార్థిక జన్మదిన శుభాకాంక్షలు..మీరు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో ఉన్న సినీ అభిమానుల హృదయ స్పందనగా కొనసాగాలి.. అంటూ ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఓ ఈవెంట్ సందర్భంలో మహేశ్‌తో సరదాగా ముచ్చటిస్తున్నపుడు తీసిన స్టిల్‌ను ఆయన ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇపుడీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పుట్టినరోజు పురస్కరించుకుని అభిమానులు ఇప్పటికే పోకిరి స్పెషల్ షోలు వేసి తమ ఫేవరేట్ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణంగా స్పెషల్ షోలంటే ఒకటో, రెండో లొకేషన్లలో వేస్తారు. కానీ పోకిరి మాత్రం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. మహేశ్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఈ ఒక్క అప్డేట్ చెప్పేస్తుంది.
Many more happy returns of the day to one of our valued green saviour @urstrulyMahesh garu. May you continue to be a heart-throb of millions of cinema fans world over 🎂💐🎉🌱. pic.twitter.com/d3V6qvB9zw
— Santosh Kumar J (@MPsantoshtrs) August 9, 2022