ఆ సీన్లు తొలగించకుంటే పఠాన్ మూవీని బ్యాన్ చేస్తాం : మధ్యప్రదేశ్ మంత్రి
షారుక్ ఖాన్, దీపికా పడుకోన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన పఠాన్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీ నుంచి రిలీజైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.
భోపాల్ : షారుక్ ఖాన్, దీపికా పడుకోన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన పఠాన్ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ మూవీ నుంచి రిలీజైన బేషరమ్ రంగ్ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పాటలో దీపికా ధరించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంతరంతో పాటు అశ్లీలం మోతాదు మించిందని పఠాన్ మూవీని బ్యాన్ చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాపై నిషేధం విధించాలని తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తం మిశ్రా కోరారు. ఈ మూవీలో కాషాయ దుస్తులను వాడటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సీన్లు ఉన్నాయని, ఈ సీన్లను మార్చనిపక్షంలో మధ్యప్రదేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామని హెచ్చరించారు.
సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న కాస్ట్యూమ్స్‌ను, వివాదాస్పద సీన్లను మార్చని పక్షంలో రాష్ట్రంలో పఠాన్ స్క్రీనింగ్‌ను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బేషరమ్ పాటలో కాస్ట్యూమ్స్ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, ఈ సాంగ్‌ను చవకబారు మైండ్‌సెట్‌తో చిత్రీకరించారని మిశ్రా ట్వీట్ చేశారు. ఇక వచ్చే ఏడాది జనవరి 25న పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

