Most Popular Film Stars | మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీలుగా ప్రభాస్, సమంత
Ormax Stars India Loves | ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటీనటుల జాబితాను ప్రకటించింది. ఇందులో టాలీవుడ్ నుంచి ప్రభాస్ మోస్ట్ పాపులర్ నటుడిగా మరోసారి నిలవగా.. హీరోయన్లలో సమంత టాప్‌లో నిలిచింది.
Ormax Most Popular Film Stars | ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతినెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి.. టాప్ పొజిషన్లో ఉన్న సెలబ్రెటీల జాబితాలను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జూన్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్, ఫిమేల్ స్టార్స్ సర్వే జాబితాను ఆర్మాక్స్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రభాస్ తర్వాత మోస్ట్ పాపులర్ నటులలో తమిళ నటుడు దళపతి విజయ్ దక్కించుకున్నాడు. ఆయన తర్వాత ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ మూడో స్థానం సంపాదించారు. పుష్ప సిరీస్‌తో ఆయనకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఐదో స్థానంలో నిలిచారు. అలాగే మహేశ్ బాబు 6 స్థానంలో, జూనియర్ ఎన్టీఆర్ 7వ స్థానంలో, రామ్ చరణ్ 8వ స్థానంలో, అక్షయ్ కుమార్ 9వ స్థానంలో, నేచురల్ స్టార్ నాని 10వ స్థానంలో నిలిచారు.
హీరోయిన్లలో స్టార్ సమంత మరోసారి అగ్రస్థానం సంపాదించి తనకు ఎదురు లేదని నిరూపించుకుంది. సమంత తర్వాత 2వ స్థానంలో అలియాభట్, 3వ స్థానంలో దీపిక పదుకొణె, 4వ స్థానంలో త్రిష, 5వ స్థానంలో కాజల్ అగర్వాల్, 6వ స్థానంలో సాయిపల్లవి, 7వ స్థానంలో లేడీ సూపర్‌స్టార్ నయనతార, 8వ స్థానంలో రష్మిక మందన్న, 9వ స్థానంలో కీర్తి సురేష్, 10వ స్థానంలో మిల్కీ బ్యూటీ తమన్నా నిలిచారు.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2025) #OrmaxSIL pic.twitter.com/Z6Du6wjyLo
— Ormax Media (@OrmaxMedia) July 18, 2025
Ormax Stars India Loves: Most popular female film stars in India (Jun 2025) #OrmaxSIL pic.twitter.com/gRGPa6TBXI
— Ormax Media (@OrmaxMedia) July 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

