Monalisa | సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా అదృశ్యం.. ఆవేదన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
Monalisa | కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు అదృశ్యమైందన్న వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఆమె వివాహం నేపథ్యంలో ఈ ఘటన మరింత అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన మోనాలిసాకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలో, కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.
Monalisa | కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ కనిపించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా ఇప్పుడు అదృశ్యమైందన్న వార్త సంచలనంగా మారింది. ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఆమె వివాహం నేపథ్యంలో ఈ ఘటన మరింత అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన మోనాలిసాకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తున్న సమయంలో, కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం ప్రారంభం నుంచే వివాదాలకు కేంద్రంగా మారింది. మోనాలిసా తల్లిదండ్రులు మాత్రమే కాకుండా దర్శకుడు సనోజ్ మిశ్రా కూడా ఈ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వివాహం సమయంలో మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని తేలడంతో కేసు మరింత తీవ్రతరమైంది. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ విచారణలో ఆమె మైనర్ అని నిర్ధారణ కావడంతో, ఫర్మాన్ ఖాన్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మోనాలిసా కనిపించడం లేదన్న వార్త బయటకు రావడం కలకలం రేపుతోంది. రాజస్థాన్లోని అజ్మేర్, పుష్కర్ ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఆమె అదృశ్యమైందని ఫర్మాన్ ఖాన్ ఒక వీడియోలో వెల్లడించాడు. “మోనాలిసా కనిపించడం లేదు.. ఆమె కోసం అజ్మేర్ అంతా వెతికాను.. ఇప్పుడు జోధ్పూర్ వెళ్తున్నాను” అంటూ అతను తెలిపాడు.
అయితే ఈ అదృశ్యం వెనుక అసలు కారణాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోనాలిసా తల్లిదండ్రులు ఫర్మాన్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కుమార్తె అదృశ్యం వెనుక అతనే ఉన్నాడని, కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కుమార్తెతో మాట్లాడనివ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఒకవైపు మైనర్ వివాహం, మరోవైపు అదృశ్యం ఈ రెండు అంశాలు కలిసి పెద్ద మిస్టరీగా మారాయి. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి మోనాలిసా ఎక్కడుందనే దానిపై దృష్టి సారించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

