Mohanlal | మోహన్ లాల్‌కి జెర్సీ గిఫ్ట్‌గా ఇచ్చిన ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ
మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చారు.
Mohanlal – Lionel Messi | మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ సంతకం చేసిన జెర్సీని బహుమతిగా ఇచ్చారు. మోహన్‌లాల్ ఈ ప్రత్యేకమైన బహుమతిని అందుకున్నందుకు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“జీవితంలోని కొన్ని క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. అవి ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఈ రోజు, అలాంటి ఒక క్షణం నేను అనుభవించాను. ఈ బహుమతిని నేను నెమ్మదిగా విప్పుతున్నప్పుడు, నా గుండె వేగంగా కొట్టుకుంది. – ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ స్వయంగా సంతకం చేసిన జెర్సీ. దానిపై నా పేరు అతని చేతితో రాయబడి ఉంది. మెస్సీని అతని ఆటతీరుకే కాకుండా, అతని నిరాడంబరత, వినయానికి కూడా అభిమానించే నాకు ఇది నిజంగా ప్రత్యేకమైనది. నా ప్రియమైన స్నేహితులు డాక్టర్ రాజీవ్ మంగోట్టిల్, రాజేష్ ఫిలిప్ సాయం లేకుండా ఈ అద్భుతమైన క్షణం సాధ్యమయ్యేది కాదు. ఈ విషయంలో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నింటికీ మించి, ఈ మరపురాని బహుమతికి దేవుడికి ధన్యవాదాలు,” అని మోహన్‌లాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ జెర్సీని మోహన్‌లాల్‌కు అతని స్నేహితులు సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహిస్తున్న ‘హృదయపూర్వం’ సినిమా సెట్లో అందజేశారు. ఈ ఊహించని బహుమతి మోహన్‌లాల్‌తో పాటు సత్యన్ అంతికాడ్ను కూడా ఆశ్చర్యపరిచింది. అభిమానులు, సహచర నటీనటులు మరియు శ్రేయోభిలాషులు మోహన్‌లాల్ పోస్ట్‌పై అభినందనలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Some moments in life feel too profound for words. They stay with you forever.
Today, I experienced one of those moments. As I gently unwrapped the gift, my heart skipped a beat—a jersey signed by the legend himself, Lionel Messi. And there it was… my name, written in his own… pic.twitter.com/V1HXjDjH89
— Mohanlal (@Mohanlal) April 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

