మంచు విష్ణు టైటిల్ రోల్‌ను పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో వివిధ భాషలకు చెందిన అగ్ర తారలు భాగమవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ భక్తిరస ప్రధాన చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాలో సీనియర్ నటులు మోహన్‌బాబు, శరత్‌కుమార్ సైతం భాగం కాబోతున్నారు. వీరిద్దరి పాత్రలు కథాగమనంలో కీలకంగా ఉంటాయని చిత్ర బృందం పేర్కొంది. త్వరలో ఈ ఇద్దరు అగ్ర నటులు ‘కన్నప్ప’ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నారు. అపర శివభక్తుడు కన్నప్ప జీవిత చరిత్రతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. న్యూజిలాండ్‌లో చిత్రీకరణ జరుగుతున్నది.