Love Me Movie | పాటలతో ప్రయోగాలు చేశారు
Love Me Movie | ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ‘ఇఫ్ యు డేర్' ఉపశీర్షిక. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్ర ఆడియో వేడుక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అనే టైటిల్ సాంగ్‌ను రాశారు చంద్రబోస్.
Love Me Movie | ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ‘ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. కీరవాణి స్వరాలందించిన ఈ చిత్ర ఆడియో వేడుక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ‘ఆటగదరా శివ..’ అనే టైటిల్ సాంగ్‌ను రాశారు చంద్రబోస్.
‘ఆటగదరా శివ..’ అనే పదాలు తనికెళ్ల భరణి జీవితంలో ఎంత ప్రధానమైనవో అందరికీ తెలిసిందే. అందుకే ఆయన అనుమతి తీసుకొని ఈ పాట చేశాం. కథానుగుణంగా మంచి పాటలు అందించే అవకాశం దక్కింది’ అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ‘కీరవాణిగారు 35 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచారు. ఆయన ప్రతి సినిమాకు ఏదో వండర్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తారు. ‘ఆటగదరా శివ..’ పాట సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏఐ సాంకేతికత ద్వారా పాట పాడించారు. ఇదొక ప్రయోగం. సినిమాలోని మొత్తం ఏడు పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి’ అన్నారు. ఈ సినిమాలో ప్రేమకథతో పాటు సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- AI
- ashish
- Dil raju
- love me movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

