విక్కీ, కియా, నూరజ్, లోహిత నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ లోన్లీ’. హరీష్‌కుమార్ దర్శకుడు. కండ్రేగుల ఆదినారాయణ నిర్మాత. ట్రైలర్మంగళవారం విడుదలైంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఓ యువకుడి జీవితంలోని మూడు దశల్ని ఆవిష్కరిస్తూ సాగే ప్రేమకథా చిత్రమిది. ప్రేమ పేరుతో అబ్బాయిలు ఎలా మోసపోతున్నారో ఈ సినిమాలో చూపించబోతున్నాం. ‘అర్జున్‌రెడ్డి’ ‘ఆర్ఎక్స్ 100’ మాదిరిగా యువతరాన్ని ఆకట్టుకుంటుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు.