Minister Malla reddy | తెలంగాణ మాడల్‌లో సినిమాలు తీస్తా: మంత్రి మల్లారెడ్డి
మొన్ననే దర్శకుడు హరీష్‌శంకర్ మా ఇంటికొచ్చి పవన్‌కల్యాణ్ సినిమాలో విలన్‌గా నటించమని గంటసేపు బతిమిలాడిండు. విలన్ పాత్రలో నటించనని చెప్పిన. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను కూడా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీద్దామని ప్లాన్ చేస్తున్నా.
‘మొన్ననే దర్శకుడు హరీష్‌శంకర్ మా ఇంటికొచ్చి పవన్‌కల్యాణ్ సినిమాలో విలన్‌గా నటించమని గంటసేపు బతిమిలాడిండు. విలన్ పాత్రలో నటించనని చెప్పిన. ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను కూడా సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీద్దామని ప్లాన్ చేస్తున్నా. అవి కూడా తెలంగాణ మోడల్లోనే ఉంటయి’ అన్నారు కార్మిక, ఉపాధి కల్పన శాఖా మంత్రి మల్లారెడ్డి. ఆదివారం జరిగిన ‘మేమ్ ఫేమస్’ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వీయ దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ పతాకాలపై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ‘సుమంత్ ప్రభాస్ తెలంగాణ నుంచి వచ్చిన హీరో.
ఆయన సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. ఇండియాలో ఫేమస్ మినిస్టర్ ఎవరైనా ఉన్నరంటే అది మన కేటీఆర్ అని గర్వపడాలి. కష్టపడి ప్రజల్లో ఉన్నవారే ఫేమస్ అవుతారు. యువత క్రమశిక్షణ అలవర్చుకొని కష్టపడితేనే విజయాలు దక్కుతాయి. అందరూ బతుకుతారు. కానీ ఫేమస్‌గా బతికే ప్రయత్నం చేయాలి. ఒకప్పుడు పాలమ్మిన నేను సీఎం కేసీఆర్‌గారి ఆశీర్వాదంతో క్యాబినెట్ మినిస్టర్ అయ్యాను. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు. మంచిగా కుదిరిన మటన్ కర్రీలాంటి సినిమా ఇదని దర్శకుడు , హీరో సుమంత్ ప్రభాస్ చెప్పారు. కొత్త కంటెంట్‌తో యువతను ప్రోత్సహించాలని ఈ సినిమా చేశామని, గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు. జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

