OG Movie Ticket Hikes | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుంచి జరగదు
OG Movie Ticket Hikes | పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
OG Movie Ticket Hikes | పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించిన టికెట్ రేట్ల పెంపు జీవోను జరిగిందని.. పక్క రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్) ఈ సినిమాకు జీవో ఇచ్చారు కాబట్టి, ఇక్కడ కూడా ఇచ్చారు అనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచడం జరగదని చిన్న సినిమాలు అయినా, పెద్ద సినిమాలు అయినా ఒక్కటే టికెట్ రేటు అమలు చేస్తాం అని మంత్రి ప్రకటించారు. అనంతరం సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వాగతించారు.
‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు బుధవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓజీ ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 800 పెంపుతో పాటు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 150 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. టికెట్ ధరలను సాధారణ రేట్లకే విక్రయించాలని న్యాయస్థానం ఆదేశించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

