Milind Soman | వయసు కేవలం సంఖ్యే.. టామ్ క్రూజ్ స్టంట్స్, ఆశ్చర్యపరుస్తున్న మిలింద్ సోమన్ సాహసాలు
Milind Soman | వయసు పెరిగేకొద్దీ ఉత్సాహం తగ్గిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, భారతీయ నటుడు-మోడల్ మిలింద్ సోమన్ ఈ జాబితాలో ముందుంటారు. 63 ఏళ్ల వయసులో కూడా టామ్ క్రూజ్ సినిమాల కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంలో వెనుకాడడం లేదు. విమానాల నుంచి దూకడం, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా ఆయన ఇప్పటికీ యువ నటులకు సవాల్ విసురుతున్నారు.
Milind Soman | వయసు పెరిగేకొద్దీ ఉత్సాహం తగ్గిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ కొందరు మాత్రం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తప్పు అని నిరూపిస్తున్నారు. హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, భారతీయ నటుడు-మోడల్ మిలింద్ సోమన్ ఈ జాబితాలో ముందుంటారు. 63 ఏళ్ల వయసులో కూడా టామ్ క్రూజ్ సినిమాల కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంలో వెనుకాడడం లేదు. విమానాల నుంచి దూకడం, హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం ద్వారా ఆయన ఇప్పటికీ యువ నటులకు సవాల్ విసురుతున్నారు.
ఇదే తరహాలో 60 ఏళ్ల వయసులోనూ మిలింద్ సోమన్ తన ఫిట్నెస్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా మే 1న ఆయన యూరప్ నుంచి ఆఫ్రికా వరకు సముద్రంలో ఏకధాటిగా ఈదుతూ అరుదైన సాహసాన్ని పూర్తి చేశారు. స్పెయిన్‌లోని తారిఫా నుంచి మొరాకో తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న జిబ్రాల్టర్ జలసంధిను దాటుతూ సుమారు 15 కిలోమీటర్ల దూరాన్ని నాన్-స్టాప్‌గా పూర్తి చేశారు. చల్లని నీటిలో అలల్ని ఎదుర్కొంటూ ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడం ఆయన శారీరక ధృడత్వానికి, మానసిక బలానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ సాహసానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. “యూరప్ నుంచి ఆఫ్రికాకు ఈదడం అద్భుత అనుభవం” అని ఆయన పేర్కొన్నారు. నెటిజన్లు “అబ్సల్యూట్ ఇన్స్పిరేషన్” అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా సాహసాలు చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సాహసంపై కొంతమంది మిశ్రమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గం మిలింద్‌ను మెచ్చుకుంటుండగా, మరికొందరు మహిళలు ఇలాంటి సాహసాలు చేస్తే సమాజం అదే విధంగా స్పందిస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మిలింద్ సోమన్ కేవలం ఫిట్నెస్ ఐకాన్ మాత్రమే కాదు, నటుడిగానూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించగా, ది రాయల్స్ వంటి ప్రాజెక్ట్స్‌లోనూ నటించారు. వ్యక్తిగత జీవితంలో ఆయన తనకంటే చిన్న వయసు గల అంకిత కొణ్వర్ను వివాహం చేసుకోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

