విక్రాంత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘స్పార్క్ L.I.F.E’.మోహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. ‘ఇది మల్టీజానర్ మూవీ. ఇందులో యాక్షన్, లవ్, రొమాన్స్, కామెడీ.. అన్నీ ఉంటాయి.
థ్రిల్ కలిగించే సినిమా కూడా. యూనివర్సల్ అప్పీల్ ఉండటం వల్లే దీన్ని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం. నవంబర్ 17న విడుదలయ్యే ఈ సినిమాలో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి’ అని విక్రాంత్ చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు. నటుడు గురు సోమసుందరం, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ తదితరులు పాల్గొన్నారు.