మరో హీరోయిన్ పెళ్లి పెటాకులు అయిపోయింది. మెహ్రీన్ కౌర్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోయింది. టాలీవుడ్ లో మెహ్రీన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఐదేళ్ళ కింద నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్నుంచి ఇప్పటి వరకు సినిమాలు చేస్తూనే ఉంది. కొన్నేళ్లుగా ఈమె కెరీర్ అంతగా జోరు మీద లేదు. ఏడాదికి ఒక్క సినిమాలో కూడా కనిపించడం లేదు మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది మెహ్రీన్. అయితే ఎఫ్ 2 లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కవచం సినిమాలో విలన్ పాత్రలోనూ మెప్పించింది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో మాత్రమే నటిస్తుంది మెహ్రీన్. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా నటిస్తుంది మెహ్రీన్. ఇప్పుడు ఈ భామ పెళ్లి ఆగిపోయింది. హర్యానాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు, దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్లడానికి నిశ్చితార్థం కూడా చేసుకుంది మెహ్రీన్. ఆయన మనవడు భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో మునిగి పెళ్లికి సిద్ధమైంది.
అయితే చివరి నిమిషంలో ఈ ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. మార్చ్ 13న ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్ పూర్ విల్లాలో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు కేవలం రెండు కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. నేడో రేపో పెళ్లి తేదీ అనౌన్స్ చేస్తారు అనుకుంటే.. ఏకంగా బ్రేకప్ కహానీ పోస్ట్ చేసింది మెహ్రీన్. తమ పెళ్లి ఆగిపోయిందని.. ఇకపై భవ్య కుటుంబంతో పాటు ఆయనతో కూడా ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చింది. తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా గౌరవిస్తారని.. ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూస్తారని కోరుకుంటున్నట్లు తెలిపింది మెహ్రీన్. తన పెళ్లి ఆగిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు మెహ్రీన్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అమీర్‌ఖాన్ దంపతుల 15 ఏండ్ల వివాహ బంధానికి తెర
కాజల్ గర్భవతా, ఇందులో నిజమెంత?
చిన్మయి గర్భవతి అంటూ ప్రచారం..క్లారిటీ ఇచ్చిన ఫేమస్ సింగర్
ప్రగ్యాని రౌండప్ చేసిన బిచ్చగాళ్లు
ఆసుపత్రి పాలైన అభిజిత్.. కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అభిమానులు