అగ్రనటుడు చిరంజీవి గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. వరుసగా సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్న ఆయనకు ఇప్పుడు కాస్త విరామం దొరకడంతో మోకాలి నొప్పికి సంబంధించిన సర్జరీని చేయించుకున్నట్లుగా తెలిసింది. ఢిల్లీలోని ఓ కార్పోరేట్ వైద్యశాలలో ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ను తీసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న ఆయన వారం రోజుల విశ్రాంతి తరువాత హైదరాబాద్‌కు రానున్నారు. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం రోజున ఆయన నటించనున్న నూతన చిత్రం ప్రారంభం కానుంది. ‘బంగార్రాజు’ ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.