ప్రేక్షకులు కోరుకున్నదే ఇస్తున్నాను: చిరంజీవి
‘ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనకి ఏం కావాలనే దాని కంటే ప్రేక్షకులు మనం నుండి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను’
‘ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనకి ఏం కావాలనే దాని కంటే ప్రేక్షకులు మనం నుండి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను’ అన్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఆయన నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకుడు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవితో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నారు?
ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందశాతం ఇవ్వాలనే ప్రయత్నంతో ‘వాల్తేరు వీరయ్య’ చేశాను. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించే సినిమా. కథ ప్రకారం ఈ చిత్రంలో నన్ను చూస్తే వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసుకునే అవకాశం వుంది. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు చిత్రాలని రీ కలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది వాల్తేరు వీరయ్య.
ఈ చిత్రంలో వినోదానికి ఎంత అవకాశం వుంది?
ముఠామేస్త్రీ, ఘరానా మొగుడు, అన్నయ్యలో ఫస్ట్‌హాఫ్ పాత్రతో పోల్చుకోవచ్చు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా అందరూ కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది.
బాబీ ఈ కథ చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న ప్రధాన అంశం ఏమిటి?
నేను ఏ కథ విన్నా ముందు ఆ కథలో ఎమోషన్ చూస్తాను. పాటలు, ఫైట్లు అదనపు అలంకరణలు. ఎమోషన్ కనెక్ట్ అయితేనే ప్రేక్షకులకు హత్తుకుంటుంది. వాల్తేరు వీరయ్యలో అంత గొప్ప ఎమోషన్ వుంది. అందుకే బాబీ కథ చెప్పిన వెంటనే వేరే ఆలోచన లేకుండా ఓకే చేశాను.
సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందు వస్తుంది. ఈసారి సంక్రాంతికి రెండో సినిమాగా వస్తున్నారు?
రెండు సినిమాలు మైత్రీ మూవీస్ సంస్థకు చెందినవే. సంక్రాంతి పండగకు ఎన్ని సినిమాలు వచ్చినా రెవెన్యూ వుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి వుంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను.
ఇన్నేళ్ల తరువాత కూడా నటుడిగా మీకు ఆకలిగా తీరలేదనిపిస్తుంది?
మా దాహం ఎప్పటికీ తీరదు. కేవలం ప్రేక్షకుల ఆదరణ నన్ను నడిపిస్తుంది. వాళ్లు ఆదరిస్తున్నారు కాబట్టే చేయగలుగుతున్నాను. బావగారు బాగున్నారాలో బంగీజంప్ చేస్తున్నప్పుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ఎంత ఎక్సయిట్‌గా ఫీలౌతారు.. అని ఊహించుకున్న తరువాత ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది. చాలా రిలాక్స్‌గా బంగీ జంప్ చేశాను.
థియేటర్ల కేటాయింపు విషయంలో మీరు సంతృప్తిగా వున్నారా?
ఫస్ట్‌డే రికార్డ్ కోసం తాపత్రయ పడితే థియేటర్లు, రెవెన్యూ లెక్కలు వుంటాయి. మా సినిమాకు రావాల్సిన షేర్ తప్పకుండా వస్తుందనే నమ్మకం వుంది.
బాబీ మీ అభిమాని.. మీరు నటించిన సన్నివేశాన్ని ఫైనల్ చేయడానికి వన్మోర్ చెప్పడానికి ఆయనకు ఫ్రీడమ్‌ని ఎలా క్రియేట్ చేశారు?
నేను ఎప్పుడూ మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ఓకే అనే వరకు అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ఓకే కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్‌ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను.
దర్శకత్వం చేసే ఆలోచన వుందా?
సరైన సమయంలో అలాంటి సందర్భం వచ్చి, దర్శకత్వం చేయాగలననే నమ్మకం వస్తే దర్శకత్వం చేస్తాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

