Brahmastra | ‘బ్రహ్మస్త్ర’లో చిరంజీవి.. వీడియో షేర్ చేసిన రాజమౌళి!
Chiranjeevi in brahmastra Movie | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మస్త్ర’ ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభమైనప్పుడు తెలుగులో ఈ సినిమాపై ఎలాంటి అంచనాల్లేవు. కానీ కొన్ని రోజుల తర్వాత నాగార్జున సినిమాలో భాగం కావడంతో మంచి క్రేజ్ వచ్చింది. ఇక కొన్ని నెలల కింద రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడని తెలియడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రంలో భాగం కాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
‘బ్రహ్మస్త్రం’ సినిమా ట్రైలర్‌కు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాజమౌళి ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ అంటూ చిరంజీవి చెబుతున్న వీడియోను జక్కన్న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న విడుదల కానుంది.
చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన నాగార్జున పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. నాగార్జున ఈ చిత్రంలో అజయ్ విశిష్ట్ పాత్రలో నటించాడు.
మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా రూపొందింది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్, మౌనీరాయ్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఈ చిత్ర ట్రైలర్ జూన్ 15న విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

