Megastar Chiranjeevi Hand Injury | వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో కుడిచేతికి కట్టుతో కనిపించాడు. దీంతో మెగాస్టార్ చేతికి ఏమైందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తన చేతికి ఉన్న కట్టు గురించి చిరంజీవి వివరణ ఇచ్చాడు.
తన కుడిచేతికి చిన్న ఆపరేషన్ జరిగినట్లు మెగాస్టార్ వెల్లడించాడు. కుడిచేయి నొప్పిగా ఉండే వైద్యులను సంప్రదించానని, మణికట్టు దగ్గరున్న నరంపై ఒత్తిడి పడినట్లు వైద్యులు చెప్పారని వివరించాడు. అపోలో ఆసుపత్రి వైద్యులు తన చేతికి ఆపరేషన్ చేశారని, మీడియన్ నర్వ్ టిష్యూలను సర్జరీ ద్వారా సరిచేశారని చిరంజీవి తెలిపాడు.
సర్జరీ జరిగిన 15 రోజుల తర్వాత చేయి యధావిధిగా పనిచేస్తుందని తెలియజేశాడు. ఈ విషయంలో అభిమానులెవరూ కంగారు పడొద్దని చెప్పాడు. ఈ ఆపరేషన్ వల్లే గాడ్‌ఫాదర్ షూటింగ్‌కు విరామం ఇచ్చినట్లు వెల్లడించాడు. వచ్చే నెల 1 నుంచి మళ్లీ షూటింగ్లో పాల్గొంటానని పేర్కొన్నాడు.