ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మక గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అగ్ర నటుడు చిరంజీవి అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుతోపాటు అందించిన నగదు బహుమతి పదిలక్షల రూపాయల్ని.. తన సామాజిక సంక్షేమ లక్ష్యానికి అనుగుణంగా ఐదు స్వచ్ఛంద సేవా సంస్థలకు విరాళంగా అందించి సహృదయతను చాటుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి.
సర్వ్ ఫౌండేషన్, దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్, వాల్మీకి ఫౌండేషన్, నయశ్రీ ఫౌండేషన్లతో పాటు క్యాన్సర్తో ధైర్యంగా పోరాడుతున్న ఓ చిన్నారి చికిత్స నిమిత్తం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి ఈ నగదుని చిరంజీవి అందించారు. శుక్రవారం రామ్చరణ్ పుట్టినరోజ సందర్భంగా, తన కుటుంబ వేడుకను సమాజానికి ఉపయోగపడేలా మార్చిన చిరంజీవికి పలువురు అభినందనలు తెలియజేశారు.