Tollywood | కొన్నిసార్లు సినిమాలు చెప్పిన సమయానికి రావడం చాలా కష్టం. ఎందుకంటే మొదలుపెట్టేటప్పుడు వేసుకున్న షెడ్యూల్స్.. షూటింగ్ జరుగుతున్నప్పుడు అయ్యే షెడ్యూల్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. రెండింటికి అసలు పొంతన ఉండదు. ముఖ్యంగా పవన్ సినిమాలకైతే ఇది చాలా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉంటాడో.. ఎప్పుడు సినిమాలకు డేట్స్ ఇస్తాడో క్లారిటీ ఉండదు. అందుకే సంక్రాంతికి వస్తుంది అనుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు పండక్కి రావడం లేదని తెలుస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టమే. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే అయింది. దాదాపు ఇంకా 55 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.
పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీలో వాటన్నింటినీ పక్కనపెట్టి హరీశ్ శంకర్ సినిమాతో బిజీ అవుతాడు అనుకోవడం అవివేకమే అవుతుంది. దాంతో పండక్కి పవన్ వస్తాడు అనుకున్న స్లాట్ ఖాళీ అవ్వనుంది. పవర్ స్టార్ రాడు అన్న విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే.. రవితేజ ఈగల్ సినిమా సంక్రాంతి రేసులో నిలబడిందనేది ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఈగల్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ నిర్మాణ సంస్థలోనే పవన్ ఇప్పుడు బ్రో సినిమా చేస్తున్నాడు. దాంతో కచ్చితంగా వాళ్లకు తెలుసు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి అనేది..! పండక్కి హరీశ్ సినిమా రావడం కష్టం అని తెలుసుకున్న తర్వాతే తమ సినిమాను వాళ్లు పోటీలో దించారు.
ఇదిలా ఉంటే తమ్ముడు తప్పుకున్న కూడా అన్నయ్య సడన్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. అన్ని కుదిరితే మెగాస్టార్ చిరంజీవి 2024 సంక్రాంతి బరిలో నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. అదేంటి ఆయన ఇప్పుడు భోళాశంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.. తర్వాత సినిమా ఏంటో కూడా చెప్పలేదు కదా.. అలాంటిది పండక్కి ఎలా వస్తాడు అని అనుమానాలు రావచ్చు. కానీ మెగాస్టార్ ప్లానింగ్ మరోలా ఉంది. మెహర్ రమేష్ సినిమా పూర్తి అయిన తర్వాత ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకొస్తున్నాడు చిరంజీవి. అందులో ఒకటి బింబిసార డైరెక్టర్ మల్లాడి వశిష్టతో చేస్తున్న సోషియో ఫాంటసీ అయితే.. మరొకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటించబోయే బ్రో డాడీ రీమేక్. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలుపెట్టి డిసెంబర్ నాటికి పూర్తి చేసి సంక్రాంతి సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి.
ఎలాగూ పవన్ రేస్ నుంచి తప్పుకుంటున్నాడు కాబట్టి ఆ ప్లేస్‌లో తాను రావాలని ఆలోచిస్తున్నాడు. 2017లో ఖైదీ నెంబర్ 150.. మొన్న వాల్తేరు వీరయ్యతో సంక్రాంతికి వచ్చి మంచి విజయం అందుకున్నాడు చిరంజీవి. అందుకే దాన్ని సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు. అయితే ఇదే పండక్కి మహేశ్ బాబు గుంటూరు కారం కూడా విడుదల కానుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా పండక్కి వస్తుందని ప్రచారం జరుగుతుంది.. కానీ ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న దాని కంటే ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అందుకే పండక్కి వచ్చే అవకాశాలు తక్కువే. ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకొని పండగ బరిలో దిగుతున్నాడు మెగాస్టార్.
Upasana | నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ అలా స్పందించాడు : ఉపాసన