హైదరాబాద్: ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమా ప్రభాస్ అభిమానుల్లో మాంచి జోష్ నింపింది. ‘ఆదిపురుష్’ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్ల దగ్గర అభిమానులు సందడి చేశారు. డప్పు చప్పుళ్ల నడుమ డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. ‘ఆదిపురుష్’ పోస్టర్లకు పూలదండలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, అగరవత్తీలు వెలిగించారు.
పలు థియేటర్ల దగ్గర పటాకుల మోత మోగించారు. అయితే, ఈ సంబురాల్లో భాగంగా ఓ అభిమాని తన అభిమానాన్ని విపరీత రీతిలో ప్రదర్శించాడు. పగిలిన బీరు బాటిల్‌తో చేయి కోసుకుని ఆ రక్తాన్ని ‘ఆదిపురుష్’ పోస్టర్‌పై చిందించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి ఫోన్లో వీడియో తీసి ట్విటర్లో పెట్టాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. అయితే, పోస్టర్లపై తెలుగు అక్షరాలను బట్టి ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినట్లు తెలుస్తున్నది.
Offline cult fans 🥵🔥
Beer bottle cheyyi koskunnadu 🙏🏼#Prabhas #Adipurush #AdipurushCelebrations pic.twitter.com/FZl3PfAww1
— ❌ BEAST ❌ (@thedevilmonstr) June 16, 2023