మెగా అభిమానమే ఈ సినిమాకు ప్రేరణ
నా కెరీర్లో చాలా వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇది. కేవలం పాతిక రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశాను. దాని కారణం మెగాస్టారే. ప్రేక్షకులు ఆయనపై పెంచుకున్న అభిమానమే ఈ స్క్రిప్ట్‌కి ప్రేరణ. నవరసాలను అద్భుతంగా, అందంగా తనదైన శైలిలో ఆవిష్కరించగల అద్భుతమైన మహానటుడు చిరంజీవి.
‘నా కెరీర్లో చాలా వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇది. కేవలం పాతిక రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశాను. దాని కారణం మెగాస్టారే. ప్రేక్షకులు ఆయనపై పెంచుకున్న అభిమానమే ఈ స్క్రిప్ట్‌కి ప్రేరణ. నవరసాలను అద్భుతంగా, అందంగా తనదైన శైలిలో ఆవిష్కరించగల అద్భుతమైన మహానటుడు చిరంజీవి. ఆయనలోని ప్రత్యేకతలన్నింటినీ తలచుకుంటూ, వాటిని కలుపుకుంటూ ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాను. అందుకే ఇంత వేగంగా పూర్తిచేయగలిగాను. నా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతిని కూడా నాకు మెమొరబుల్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.
ఆయన దర్శకత్వంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా రూపొందిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్‌గారు’. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన మెగాబ్లాక్బస్టర్ థాంక్ యు మీట్లో అనిల్ రావిపూడి మాట్లాడారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ కాస్తా బాస్ ఆఫీస్ అవుతుందని రెండు నెలల క్రితమే అనిల్‌తో చెప్పానని, అనుకున్నట్టే అద్భుతమైన విజయాన్ని ఈ సినిమా అందుకున్నదని నిర్మాత సాహు గారపాటి ఆనందం వెలిబుచ్చారు. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని, నిర్మాతగా ఇది తన తొలి సినిమా అనీ, మెగాస్టార్ కూతురుగా ఆయన పేరు నిలబెట్టాననే అనుకుంటున్నానని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల అభిప్రాయపడ్డారు. ఇంకా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

