Mega 156 | మెగా 156 నుంచి బిగ్ అప్డేట్.. 17 ఏండ్ల తరువాత క్రేజీ కాంబో రిపీట్.!
Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ మెగా156(Mega156). ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాన్ ఇండియాలో లెవల్లో రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Megastar Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ మెగా 156(Mega156). ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాన్ ఇండియాలో లెవల్లో రానున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే.. హీరోయిన్ విషయంలో చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వకపోగా.. తాజాగా మరోసారి మెగా 156 హీరోయిన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే.. త్రిష దాదాపు 17 ఏండ్ల తరువాత చిరుతో నటించనుంది. కాగా దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిష చివరిగా మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ సాధించింది.
మరోవైపు ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. చిరు, సునీల్లది మంచి కాంబినేషన్. చిరంజీవి ఇంద్ర, స్టాలిన్, అందరివాడు, జై చిరంజీవా, గాడ్ ఫాదర్ చిత్రాల్లో మెరిశాడు సునీల్. ఇప్పుడు ఈ వశిష్ట చిత్రంలో కూడా సునీల్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో నటిస్తున్నడని తెలుస్తోంది.
ఇక పుష్ప తర్వాత తన రూటు మార్చుకొని కొన్ని విలక్షణమైన పాత్రలతో అలరిస్తున్నారు సునీల్. ఇటివలే జైలర్‌తో పాటు జపాన్‌లో కూడా మంచి పాత్రలో కనిపించారు. చిరంజీవి చిత్రంలో కూడా సునీల్ పాత్ర గుర్తుపెట్టుకునేలా ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

