Ramcharan | నా కొత్త స్నేహితుడు.. ట్రెండింగ్‌లో రాంచరణ్ స్టిల్స్
Ramcharan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ramcharan) ఎప్పటికపుడు కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మెగాపవర్ స్టార్ తాజాగా తన కొత్త స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంతకీ ఆ స్నేహితుడెవరనేది అర్థమయ్యే ఉంటుంది.
Ramcharan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ramcharan) ఎప్పటికపుడు కొత్త సినిమాల అప్డేట్స్ ఇస్తూ.. అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మెగాపవర్ స్టార్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో నటిస్తోన్న గేమ్ ఛేంజర్ (Gamechanger)ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ స్టార్ హీరోకు గుర్రాలన్నా, గుర్రపు స్వారీ అన్నా చాలా ఇష్టమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా తన కొత్త స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాంచరణ్. ఇంతకీ ఆ స్నేహితుడెవరనేది అర్థమయ్యే ఉంటుంది.
నా కొత్త స్నేహితుడు.. బ్లేజ్ (Blaze).. అంటూ బ్లాక్ హార్స్‌తో చిల్అవుట్ అవుతున్న స్టిల్స్‌ను పోస్ట్ చేశాడు. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కొన్ని రోజుల క్రితం గుర్రపు స్వారీ చేస్తూ కనిపించాడని తెలిసిందే. మరి రాంచరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో హార్స్రైడింగ్కు సంబంధించిన సీన్లు ఏమైనా పెట్టాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు ఈ ఫొటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో గేమ్ ఛేంజర్‌లో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన (Buchi Babu Sana)దర్శకత్వంలో RC16ను ప్రకటించాడని తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఆర్సీ16 షూటింగ్ అప్డేట్ రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని కొత్త ప్రొడక్షన్ హౌస్ వృద్ధి సినిమాస్, సుకుమార్-మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి తెరకెక్కిస్తోంది.
బ్లేజ్ తో రాంచరణ్..
ఆఫీస్ ప్రారంభోత్సవ ఫొటోలు..
The team of #RC16 from the office opening Pooja ❤️
Full fledged Pre-production underway💥
Mega PowerStar @AlwaysRamCharan @BuchiBabuSana @aryasukku @vriddhicinemas @SukumarWritings @MythriOfficial pic.twitter.com/8pjGiCARC2
— Vriddhi Cinemas (@vriddhicinemas) August 27, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

