Test | మాధవన్, సిద్దార్థ్ పాన్ ఇండియా సినిమా అప్డేట్
Test | పాన్ ఇండియా సినిమా టెస్ట్ (Test) ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. టెస్ట్ చిత్రంలో అందాల తార మీరా జాస్మిన్ (Meera Jasmine) కీలక పాత్రలో నటిస్తుందని తెలియజేస్తూ.. సోషల్ మీడియా ద్వారా అప్డేట్ అందించారు మేకర్స్.
Test | స్టార్ హీరో మాధవన్, సిద్దార్థ్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టెస్ట్ (Test) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. టెస్ట్ చిత్రంలో అందాల తార మీరా జాస్మిన్ (Meera Jasmine) కీలక పాత్రలో నటిస్తుందని తెలియజేస్తూ.. సోషల్ మీడియా ద్వారా అప్డేట్ అందించారు మేకర్స్.
అయితే మీరా జాస్మిన్ పోషించే పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. టెస్ట్ చిత్రాన్ని ఎస్ శశికాంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. వై నాట్ స్టూడియోస్ సమర్పణలో చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాపులర్ సింగర్ శక్తి శ్రీ గోపాల్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుతుండటం విశేషం. పలు ప్రధాన భారతీయ భాషల్లో టెస్ట్ విడుదల కానుంది.
తెలుగులో చివరిసారిగా మోక్ష సినిమాలో నటించింది మీరా జాస్మిన్. మీరాజాస్మిన్ మరోవైపు ఇటీవలే కొత్త సినిమా లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ భామ టైటిల్ రోల్ చేస్తున్న మలయాళ ప్రాజెక్ట్ క్వీన్ ఎలిజబెత్ (Queen Elizabeth). ఈ చిత్రానికి ఎం పద్మాకర్ దర్శకత్వం వహిస్తుండగా.. రంజిత్ మనంబరక్కత్, శ్రీరామ్ మనంబరక్కత్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. Narein లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
New Addition to #Test
Stars Maddy, Siddharth, Nayantara. pic.twitter.com/gSnXd9xTus
— Christopher Kanagaraj (@Chrissuccess) May 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

