Meena | ‘నేటి హీరోయిన్లను చూస్తుంటే జాలేస్తుంది. ఇంత దారుణమైన సోషల్‌మీడియాను ఎదుర్కుంటూ కెరీర్ సాగిస్తున్నారంటే నిజంగా వారిని అభినందించాలి. యాభైకి దగ్గరపడుతున్న నాలాంటి వారినే వదలడం లేదు. లేనిపోనివి ఊహించి రాసేస్తూ, ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మా పరిస్థితే ఇలా ఉంటే, ఇక యంగ్‌స్టర్స్ పరిస్థితేంటి?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నాటి అందాలతార మీనా. ఇటీవల సోషల్‌మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడింది మీనా.
‘నా భర్త పోయారు. ఇప్పుడు నా బిడ్డ, నా తల్లిదండ్రులే సర్వస్వంగా బతుకుతున్నాను. కానీ నేను వేరే ఎవరితోనో రిలేషన్లో ఉన్నట్టు, త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు రాస్తున్నారు. నాకూ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. నేనేకాదు.. ఇలాంటి రోత రాతల వల్ల నా ప్రపంచంలో ఉన్నవాళ్లంతా సఫరవుతారు. అబద్ధాలు రాసి బతకడం వ్యభిచారంతో సమానం. ఇంతకంటే దిగజారుడు తనం వేరొకటి ఉండదు. ఇప్పటికైనా మనుషుల్లా బతకండి’ అంటూ ఆవేశంగా మాట్లాడింది మీనా.