Vikram | ‘విక్రమ్’ ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న కమల్ సిగ్నేచర్ స్టెప్స్!
Vikram | విశ్వనటుడు కమల్ హాసన్ ట్రెండ్‌కు తగ్గట్టుగా కథలను ఎంచుకుంటూ యువ హీరోలకు ధీటుగా సినిమాలను చేస్తుంటాడు. ఈయన నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘విక్రమ్’. ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. గతేడాది విడుదలైన టైటిల్ టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. గతకొంత కాలంగా కమల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్లు మళ్ళీ అప్పటి కమల్‌ను గుర్తుచేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్3న విడుదల కానుంది.
ఈ క్రమంలో చిత్రబృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మత్తుగా మత్తుగా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను కమల్ ఆలపించాడు. ఈ పాటలో కమల్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంఅందించాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

