డబుల్ ఫన్ అండ్ థ్రిల్
శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మత్తు వదలరా-2’. రితేష్ రానా దర్శకుడు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.
శ్రీసింహ కోడూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మత్తు వదలరా-2’. రితేష్ రానా దర్శకుడు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగింది.
ఈ సందర్భంగా హీరో శ్రీసింహ కోడూరి మాట్లాడుతూ ‘తొలిభాగం పెద్ద హిట్ అయింది. దాంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ కంటే డబుల్ ఫన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దాం’ అన్నారు. ఈ సినిమా విజయంపై టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని నిర్మాత వై.రవిశంకర్ చెప్పారు.
ఈ సినిమాలో తాను ఓ పాట రాయడంతో పాటు పాడానని కథానాయిక ఫరియా అబ్దుల్లా తెలిపింది. తొలిభాగానికి మించిన మలుపులతో సినిమా ఉత్కంఠను పంచుతుందని నిర్మాత చెర్రీ పేర్కొన్నారు. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, రచన-దర్శకత్వం: రితేష్ రానా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

