ముంబై : బాలీవుడ్ భామ, ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా (Masaba Gupta) సోషల్ మీడియాలో చురుకుగా ఉండే సెలబ్రిటీల్లో ఒకరు. ఫుడ్ రిలేటెడ్ పోస్ట్‌లతో ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఆరోగ్యకర జీవనశైలిని అనుసరిస్తూనే మసాబా తనకు ఇష్టమైన ఆహార పదార్ధాలను ఆస్వాదిస్తూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది.
ఆరోగ్యం, ఫిట్నెస్ ఔత్సాహికులకు, ఫ్యాన్స్‌కు మసాబా స్ఫూర్తిగా నిలుస్తుంటుంది. మసాబా ఇటీవల ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో తన డిసెంబర్ కిచెన్ గ్లింప్స్‌ను షేర్ చేసింది. ఇందులో అన్నీ హెల్ధీ ఛాయిస్లే ఉన్నాయి. ఆమె షేర్ చేసిన ఫొటోలో రాగి బాటిల్లో నీరు, బీట్రూట్ జ్యూస్‌తో నిండిన గ్లాస్, బ్రహ్మి, స్పిరులినా మిశ్రమం కనిపించాయి.
రోజూ ఉదయం గట్, హెయిర్, స్కిన్ ఆరోగ్యం కోసం ఆమె వీటిని తీసుకుంటుంది. వీటిత పాటు ఆ ఫొటోలో ఓ టీ బ్యాగ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రాం స్టోరీకి మసాబా క్యాప్షన్‌లో వెల్కం టూ మై డిసెంబర్ కిచెన్ అని రాసుకొచ్చారు.
Read More :