Son Of Sardaar | దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన చిత్రం మర్యాద రామన్న(Maryada Ramanna). ఆర్కా మీడియా బ్యానర్‌పై శోభు యార్లగడ్డా, దేవినేని ప్రసాద్ నిర్మించారు. సలోని కథానాయికగా నటించిది. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం 2010లో విడుదలై సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేసుకుంది.
అయితే ఇదే సినిమాను బాలీవుడ్లో సన్ అఫ్ సర్దార్ (Son Of Sardaar) అనే పేరుతో అజయ్ దేవగణ్ రీమేక్ చేసి హిట్టు అందుకోవడమే కాకుండా.. రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమాకు బాలీవుడ్లో తాజాగా సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్. సన్ అఫ్ సర్దార్ 2 అంటూ ఈ సినిమా రాబోతుండగా.. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ పార్ట్ లాగే ఈ చిత్రం కూడా కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్నట్లు తెలుస్తుంది. విజయ్ కుమార్ అరోరా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మృణాల్ థాకుర్ కథానాయికగా నటించబోతుంది.
The Return of the Sardaar 🔥#SOS2 in cinemas near you on 25th July. #SardaarIsBack #SonOfSardaar2 @mrunal0801 @jiostudios @ADFFilms @tseries #JyotiDeshpande @KumarMangat @nrpachisia #PravinTalreja #VijayKumarArora #JagdeepSinghSidhu @danishdevgn pic.twitter.com/vzSelTPEpV
— Ajay Devgn (@ajaydevgn) June 19, 2025