‘కరోనా మహమ్మారి మనకు నవ్వుల్ని దూరం చేసింది. ప్రతి ఒక్కరు ఒక రకమైన భయంలోకి వెళ్లిపోయారు. ఈ విషాదం నుంచి ప్రజలు తేరుకునేలా నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన నుంచే ‘మంచి రోజులు వచ్చాయి’ కథ పుట్టింది’ అన్నారు మారుతి. ఆయన దర్శకత్వంలో సంతోష్‌శోభన్, మెహరీన్ జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్ నిర్మాతలు. శనివారం హైదరాబాద్‌లో క్యారెక్టర్ లుక్ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ ‘ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసి థియేటర్స్‌లోనే విడుదల చేయాలనే లక్ష్యంతో టీమ్ అంతా పనిచేశాం. కరోనా నేపథ్యంలో మనుషుల స్వభావం, జీవన విధానంలో వచ్చిన మార్పులను వినోదాత్మక కోణంలో ఈ సినిమాలో ఆవిష్కరించాం’ అన్నారు. మంచి మిత్రులున్న ఎవరికైనా మంచి రోజులొస్తాయని, ఆద్యంతం చక్కటి హాస్యంతో సాగే చిత్రమిదని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిదని హీరో సంతోష్ శోభన్ చెప్పారు. మోహరీన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఒప్పుకోవడంతోనే మంచి రోజులొచ్చాయనే భావన కలిగింది. నవ్వుల్ని పంచుతూనే ఓ ఔషదంలా పనిచేసే సినిమా ఇది’ అని చెప్పింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాణ సంస్థలు: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి.