బాలీవుడ్ (Bollywood) మంచి పాపులారిటీ ఉన్న యాక్టర్లలో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) ఒకడు. తక్కువ టైంలోనే స్టార్ డమ్ సంపాదించాడీ యువ నటుడు. కార్తీక్ ఆర్యన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..ఫీ మేల్ ఆడియెన్స్ అయితే ఎందరున్నారో చెప్పలేం. సోషల్‌మీడియా (social media)లో పాపులర్ యాక్టర్. ఆసక్తికమైన విషయమొకటి సోషల్‌మీడియాలో ఇపుడు తెగ వైరల్ అవుతోంది. ధమాకా నుంచి డైలాగ్‌ను ఓ అభిమాని ఇమిటేట్ చేసిన వీడియోను కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురిసింది.
అయితే ఫీమేల్ ఫ్యాన్స్ (female fan) చేసిన ఓ కామెంట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. తనను పెళ్లి చేసుకుంటే రూ.20 కోట్లు ఇస్తానని ఓ అమ్మాయి కార్తీక్ ఆర్యన్‌కు ఆఫర్ ఇస్తూ కామెంట్ పెట్టింది. వీడియోకు లైక్ చేసిన తర్వాత..నన్ను పెళ్లి చేసుకో..నీకు 20 కోట్లిస్తా అని కామెంట్ చేసింది. కార్తీక్ ఆర్యన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా తనదైన స్టైల్లో ఎప్పుడు..? అని కామెంట్ పెట్టి..లాఫింగ్ ఎమోజీని పోస్ట్ చేశాడు.
మొత్తానికి అమ్మాయి నుంచి పెద్ద మొత్తంలో ఆఫర్ రావడంతో మరి పెళ్లిపుడు అన్నట్టుగా కామెంట్ పెట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు కార్తీక్ ఆర్యన్. ఈ హీరో నెట్‌ఫ్లిక్స ప్రాజెక్టు ధమాకాలో చివరిసారిగా నటించాడు.