Mamannam Trailer | ఉత్కంఠ భరితంగా మామన్నమ్ సినిమా ట్రైలర్..!
Mamannam Movie Trailer | మారి సెల్వరాజ్.. ఈ పేరు తమిళనాట ఒక సంచలనం. ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలే అయినా.. పది సినిమాల తాలూకు గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజంలో కింది స్థాయి వాళ్లను ఎలా చూస్తారు.
Mamannam Movie Trailer | మారి సెల్వరాజ్.. ఈ పేరు తమిళనాట ఒక సంచలనం. ఇప్పటివరకు చేసింది రెండు సినిమాలే అయినా.. పది సినిమాల తాలూకు గుర్తింపు తెచ్చుకున్నాడు. సమాజంలో కింది స్థాయి వాళ్లను ఎలా చూస్తారు. సమాజంలో వాళ్లకు ఎలాంటి గుర్తింపు ఉంది. అనే కోవలోనే మారి రెండు సినిమాలు తెరకెక్కించాడు. అవి రెండు తమిళంలో కోట్లు కొల్లగొట్టాయి. అంతేకాదు రాంకింగ్స్‌లో కూడా ఆ రెండు సినిమాలు టాపే. ప్రస్తుతం ఆయన మామన్నమ్ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఉదయనిధి స్టాలిన్, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ మామన్నమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
లెటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సాగింది. పరియారుమ్ పెరుమాళ్, కర్ణన్ మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక డార్క్ మోడ్‌లో సినిమా సాగుతున్నట్లు స్పష్టమయింది. ఒక పొలిటీషియన్‌కు, సాధరణ మధ్య తరగతి తండ్రికి మధ్య జరిగే రివేంజ్ స్టోరీలా అనిపిస్తుంది. ఆ పగను కొడుకుతో పాటు తీర్చుకోవాలనుకుంటున్నట్లు హీరోతో వాళ్ల నాన్న చెప్పే డైలాగ్స్ వింటే స్పష్టమయింది. యాక్షన్ కూడా పుష్కలంగా దట్టించినట్లు తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్‌కు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలవబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను రెడ్ జియాంట్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bureaucrats | డోంట్‌కేర్ సర్కార్.. ప్రభుత్వం పనైపోయింది, మళ్లీ వచ్చేది లేదు! నిర్ధారణకు వచ్చిన బ్యూరోక్రాట్లు
BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
ధరలపై దండెత్తిన మహిళలు
ఇద్దరు మైనర్లపై లైంగికదాడి నిందితుల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

