తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. ఈ సినిమా ద్వారా రవితేజ సోదరుడి తనయుడు.. మాధవ్ హీరోగా పరిచయమవుతున్నాడు. మంచాల నాగరాజ్ దర్శకుడు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో మాధవ్ యాక్షన్మోడ్లో కనిపిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ బలమైన భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. దీపా బాలు, వినోద్‌కుమార్, వికాస్ వశిష్ట తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాత: మయూర్ రెడ్డి, దర్శకత్వం: మంచాల నాగరాజ్.